Sunday, March 29, 2009

అప్పటివరకు కలిసి మెలిసి ఉన్నవారే.... టికెట్ ఇవ్వలేదని తెలిసేసరికి బద్ద శత్రువులు అయిపోతారు.. . టికెట్ రాలేదని అసంతృప్తి తో ఏమి చేస్తుంటారో వారికి కూడా తెలియదు అనుకుంటాను....... పాపం.. కుర్చీలు విరగ్గోడతారు, పార్టీ కార్యాలయాలను తగులబెడతారు.. అధిష్టానానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తారు, తిడతారు, కొందరు అభిమానులు అయితే పెట్రోలో కిరసనాయిలో పోసుకుని తగులబెట్టుకుంటారు. అంటే జీవితాంతం వీళ్ళే రాజకీయాల్లో ఉంటే. ఇక కొత్తవారు వచ్చేదెప్పుడు? వాళ్లకు కూడా అవకాసం ఉండాలి కదా..

రైతన్నల కడుపు నిండా మెతుకులు తినే రోజు ఎప్పుడు వస్తుంది, నిరుద్యోగులు (ఉద్యొగార్దులు) వారి కలలను నిజం చేసుకునే రోజు ఎప్పుడు వస్తుంది, నిరుపేదల జీవితాల్లో వెలుగులు నిండి, వారి మొహంలో సంతోషం ఎప్పుడు చూస్తాము, నిరక్షరాస్యత ఎప్పుడు తగ్గుతుంది, స్త్రీలకు మగజాతి వల్ల ఇక ఇబ్బంది ఉండదు అని ఎప్పుడు అనుకుంటుంది.

ఇవన్ని చూడాలంటే...

ఒక నిర్థిష్టమైన ప్రణాళిక, భవిష్యత్తు గురించిన సమగ్ర అవగాహన, సమకాలీన అవసరాలపై పట్టు, ప్రజల అవసరాలను తెలుసుకుని, వీటన్నిటిని అన్ని వర్గాల (బీద, బలహీన, సంపన్న) వారికి ఆమోదయోగ్యంగా అమలు చేసే పభుత్వం రావాలి.

"Raaja""key"am...

ఏంటో. ఈ రాజకీయాలు చూస్తుంటే చ్చిరాకుగా ఉంది. అంతా తమ తమ స్వంత ప్రయోజనాలకోసమే ఈ రాజకీయాలలో ఉంటున్నరేమో అనిపిస్తుంది, అనిపించడం ఏంటి.. జరుగుతుంది కూడా అదే కదా..
అయినా.. పార్టీ టికెట్ ఇస్తే ఏంటి ఇయ్యకపోతే ఏంటి.? ఒక పార్టీ లో ఇన్ని రోజులు సేవ పేరుతొ ఉన్నారు కదా. మరీ ఇప్పుడు టికెట్ ఇవ్వలేదని వెళ్ళిపోతే.. అర్థం.. ఆ సేవ అంతా. ఉట్టి మాటే అన్నమాట...

Sunday, August 5, 2007

manasulo maata...

hello.. welcome to my blog...